ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రాహుల్ సిక్సర్...

రాహుల్ సిక్సర్...

రాహుల్ బౌన్స్ బ్యాకయ్యారు.లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి గెలిపించాలని ప్రధాని మోడీ.. బీజేపీ సభ్యులకు సూచించగా..దాన్ని రాహుల్ చేసి చూపించారు.సభలో ప్రభుత్వంతీరును పూర్తిస్థాయిలో ఎండగట్టారు. అంతేకాదు..చర్చ సందర్భంగా రాహుల్ వాడిన పదాలు...ఆయన భావోద్వేగం.. మణిపురీల కన్నీళ్లను వర్ణించిన విధానం..ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పొచ్చు. దీన్ని ఎదుర్కొనేందుకు మోడీ సహా బీజేపీ ఎంపీలు శతవిధాలుగా ప్రయత్నించారు.

తాను మణిపూర్ వెళ్లానని.. అక్కడి ప్రజల కష్టాలు, కన్నీళ్లను స్వయంగా చూశానన్నారు రాహుల్.కానీ..ప్రధాని మాత్రం ఆబాధలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.మణిపూర్‌ లో భారతమాతను చంపేశారని తీవ్రమైన వ్యాఖ్యలుచేశారు. అంతేకాదు..ప్రధానికి అదానీ, అమిత్‌షాల మాటలే వినిపిస్తాయన్నారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ప్రధాని మోడీకి.. మణిపూర్‌లో హింసను ఆపాలని లేదని ఘాటు విమర్శలే చేశారు రాహుల్. సైన్యాన్ని ఉపయోగిస్తే..కేవలం ఒక్కరోజులో సమస్య సాల్వ్ అయ్యేదన్నారు. కానీ.. రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.ఇంత జరుగుతున్నా, సీఎం బిరేన్ సింగ్‌ను తొలగించలేదని గుర్తు చేశారు.

అంతేనా... మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, సభనుంచి అనర్హతకు గురైన రాహుల్...తిరిగి న్యాయపోరాటం చేసి, సభకు రాగలిగారు. తాను ఏ భవనాన్ని అయితే ఖాళీ చేశారో .. ఇప్పుడదే రూమ్‌లో తిరిగి ఎంటరయ్యారు.అంటే.. ఏదేది తాను కోల్పోయారో.. వాటన్నింటినీ తిరిగి సాధించారు రాహుల్. రాహుల్ ప్రసంగంతో కాంగ్రెస్ ఎంపీలు సైతం పూర్తిగా చార్జ్ అయ్యారు. సభలో ప్రసంగం ముగించుకున్న తర్వాత బయటకు వెళ్తున్న సమయంలో రాహుల్.. చాలా ఉల్లాసంగా కనిపించారు.అంతే కాదు..రాజస్థాన్ టూర్‌లో సైతం మోడీ సర్కార్‌పై రాహుల్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :