ASBL NSL Infratech

ఏడాదైనా ఓటీటీలోకి రాని ఏజెంట్

ఏడాదైనా ఓటీటీలోకి రాని ఏజెంట్

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అఖిల్ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్తుందనుకుంటే ఇంకొన్ని అడుగులు కిందకు జార్చేయడం ఎప్పటికీ జీర్ణించుకోలేరు. స‌రిగ్గా గ‌తేడాది ఇదే రోజున ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ సినిమా రిలీజైంది. ఆ రోజున అక్కినేని అభిమానులు అంత ఈజీగా మ‌ర్చిపోలేరు. ఏజెంట్ సినిమాతో అఖిల్ కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్తుంద‌నుకుంటే అది మ‌రెక్కడికో వెళ్లింది. ఏజెంట్ ఎఫెక్ట్ వ‌ల్లే యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో అఖిల్ చేయాల్సిన త‌ర్వాతి సినిమా ఇంకే లేట‌వుతూనే వ‌స్తుంది.

ఇదిలా ఉంటే ఈ ఏజెంట్ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలోకి రాలేదు. సోనీ లివ్ వాళ్లు చాలా సార్లు ప్రీమియ‌ర్ కోసం డేట్స్ అనౌన్స్ చేశారు కానీ లాస్ట్ మినిట్ లో వాయిదా వేస్తూ వ‌చ్చారు. రైట్స్ అమ్మేశాం కాబ‌ట్టి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని నిర్మాత అనిల్ సుంక‌ర అంటున్నాడు. పోనీ టీవీలో అయినా వ‌చ్చిందా అంటే అదీ లేదు. ఓ డిస్ట్రిబ్యూట‌ర్ వేసిన కేసు వ‌ల్లే లేట‌వుతుంద‌ని అంటున్నారు. కానీ ఈ ప్రాబ్ల‌మ్ కు అస‌లు సొల్యూష‌న్ ఉంటుందా లేదా అనేది అంతు చిక్క‌డం లేదు. మంచో చెడో ఏదైనా కానీ వీలైనంత త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి బుల్లి తెర‌పై తీసుకురావ‌డం వ‌ల్ల ఎంతో మంది ఆడియ‌న్స్ చూసే ఛాన్స్ ద‌క్కుతుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :