ASBL Koncept Ambience
facebook whatsapp X

కాంగ్రెస్‌కు దేశం పట్ల గౌరవం లేనే లేదు: ధర్మపురి అర్వింద్

కాంగ్రెస్‌కు దేశం పట్ల గౌరవం లేనే లేదు: ధర్మపురి అర్వింద్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. సర్జికల్ స్ట్రైక్స్ ఎలా నమ్మాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారని, అయితే సీఎం రేవంత్ ప్రశ్నిస్తోంది ప్రధానిని కాదని, ఈ దేశ రక్షణ దళాల నిబద్ధతను ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకోసారి బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతుండేవని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

‘‘సర్జికల్ స్ట్రైక్ అబద్దమని, భారత వాయు దళాలు పాకిస్థాన్‌లోని దూరి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది అబద్దమని అంటున్నావ్. అలా అయితే అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్‌కి పిక్‌నిక్ వెళ్లి వచ్చాడా? ఏం మాట్లాడుతున్నావ్, ఏం అడుగుతున్నావ్? ఒక్కసారి దిమాక్ పెట్టి ఆలోచించు’’ అంటూ రేవంత్‌పై విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ వ్యాఖ్యలతో ఒక్కటి మాత్రం స్పష్టం అవుతోందని, కాంగ్రెస్ వాళ్లకి దేశం పట్ల గౌరవం కానీ, నిబద్దత కానీ లేదని, కేవలం ఓట్లు దండుకుని కేంద్రంలో అధికారంలోకి రావాలని మాత్రమే ఆలోచిస్తోందని అర్వింద్ ఆరోపించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :