ASBL NSL Infratech

సంక్రాంతి కోసం నాగ్ కొత్త స్కెచ్

సంక్రాంతి కోసం నాగ్ కొత్త స్కెచ్

ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న నాగార్జున వ‌చ్చే ఏడాది కూడా ఎంత కాంపిటీష‌న్ ఉన్నా త‌న సినిమా కూడా సంక్రాంతికి ఉండాల‌ని నాగ్ బ‌లంగా డిసైడ‌య్యాడు. మొన్నా మ‌ధ్య ఓ ఈవెంట్ లో మ‌ళ్లీ జ‌న‌వ‌రిలో క‌లుద్దామ‌ని కూడా నాగ్ అన్నాడు. అయితే నాగ్ ప్ర‌స్తుతం చేస్తున్న కుబేర సినిమా ఆ టైమ్ కు వ‌చ్చే ఛాన్స్ లేదు.

దీంతో నాగ్ మ‌రో స్కెచ్ ను రెడీ చేసిన‌ట్లు టాక్. త‌న‌కు నా సామిరంగా లాంటి హిట్ అందించిన విజ‌య్ బిన్నీకు నాగ్ మ‌రో ఛాన్స్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. మ‌రోసారి రిస్క్ లేకుండా రీజ‌న‌బుల్ బ‌డ్జెట్ లో త‌క్కువ కాల్షీట్స్ తో పూర్త‌య్యేలా విజ‌య్ రెండు మూడు క‌థ‌లు అనుకున్నాడ‌ట‌. వాటిలో ఒక‌టి విదేశీ రీమేక్ కూడా ఉంద‌ని టాక్. అయితే ఈ మూడింటిలో ఏది బెట‌ర్ గా అనిపిస్తే దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని చూస్తున్నార‌ట‌. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ సారి కూడా మూడు నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి రావాల‌ని చూస్తున్నాడ‌ట నాగ్. విజ‌య్ బిన్నీ సినిమాను న‌వంబ‌ర్ లోపు కంప్లీట్ చేసి ఫ‌స్ట్ కాపీ రెడీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట నాగ్.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :