ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బీజేపీతో వన్ టు వన్ ఫైట్.. సమరభేరి మోగించబోతున్న విపక్షాలు!!

బీజేపీతో వన్ టు వన్ ఫైట్.. సమరభేరి మోగించబోతున్న విపక్షాలు!!

సార్వత్రిక ఎన్నికలకు ఇంకో 10 నెలలు మాత్రమే సమయం ఉంది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలని విపక్షాలన్నీ గట్టిగా కోరుకుంటున్నాయి. ఇప్పటికే 9 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందని, మోదీ సర్కార్ ను సాగనంపకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ఓడించడం ఒక్క పార్టీతో అయ్యే పని కాదు. అందుకే అందరం కలిసికట్టుగా పోరాడదామనే నిర్ణయానికి వచ్చాయి విపక్షాలు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 23న బీహార్ రాజధాని పట్నాలో విపక్ష నేతలందరూ భేటీ అవుతున్నారు.

పట్నా భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష నేతలు సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు హాజరవుతున్నారు. ఆప్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), జేఎంఎం, సీపీఐ, సీపీఎం లాంటి కీలక పార్టీల అధినేతలందరూ పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, బిజూ జనతాదళ్, అన్నాడీఎంకే, జేడీఎస్ లాంటి పార్టీలకు ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఈ పార్టీలు బీజేపీతో కలసి వెళ్తాయని విపక్షాలు నమ్ముతుండడమే ఇందుకు కారణం.

పట్నా సమావేశంలో ముఖ్యంగా బీజేపీని ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టనున్నారు విపక్ష నేతలు. ముఖ్యంగా మమత బెనర్జీ ప్రతిపాదించిన వన్ టు వన్ ఫైట్ పై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీపై ఒక్కరే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఉండాలని మమత ప్రతిపాదించారు. అప్పుడు బీజేపీని ఓడించడం ఈజీ అని ఆమె చెప్తున్నారు. ఇందుకోసం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట ప్రాంతీయ పార్టీలు కూడా ఇలాగే వ్యవహరించాలన్నారు. ఇలా అందరం కలసికట్టుగా ఏకతాటిపై నిలిస్తే మోదీని ఓడించడం పెద్ద కష్టం కాబోదనేది మమత ప్రతిపాదన. అయితే మమత ప్రతిపాదనకు ఎంతమంది ఓటేస్తారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అన్ని పార్టీలు తమక పట్టుందని .. తామే పోటీ చేస్తామని చెప్పుకుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకటికి మించిన పార్టీలు బలంగా ఉన్నాయి. అలాంటి చోట మమత ప్రతిపాదన వర్కవుట్ అవుతుందా.. అంటే చెప్పలేం.

అయితే ఇప్పుడు సమావేశమవుతున్న నేతలంతా బీజేపీని ఓడించాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ అందుకోసం కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. దానికి సిద్ధపడితే అప్పుడు వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంతా మళ్లీ ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతుంటారు. పైగా విపక్ష కూటమికి నేతృత్వం వహించేది ఎవరు.. ఆ నేతను మిగిలిన పార్టీల నేతలు ఒప్పుకుంటారా.. లాంటి అనేక ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ఇవన్నీ వర్కవుట్ అయితే మాత్రం బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :