ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

36 ఏళ్ల తర్వాత రజనీకాంత్ తో కలిసి యాక్ట్ చేస్తున్న నటుడు!

36 ఏళ్ల తర్వాత రజనీకాంత్ తో కలిసి యాక్ట్ చేస్తున్న నటుడు!

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘జైలర్’ చిత్రంలో సౌత్ స్టార్ హీరో రజనీకాంత్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ తో కలిసి జాకీష్రాఫ్ నటిస్తున్నారు. 1987లో వచ్చిన హిందీ చిత్రం ‘ఉత్తర్ దక్షిణ్’ తర్వాత రజనీకాంత్, జాకీష్రాఫ్ మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ‘జైలర్’ కావడం విశేషం.

దాదాపు 36 ఏళ్ల తర్వాత రజనీ, జాకీష్రాఫ్ కలిసి నటిస్తున్నారన్నమాట. ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటించనుంది. ఈ మేరకు తమన్నా ఫస్ట్ లుక్ కూడా ఇటీవల రిలీజైంది. ఈ మూవీలో మాలీవుడ్ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తో పాటు కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌, కమెడియన్ సునీల్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :