ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్

ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్

ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ కోపర్ని ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్‌ బ్యాగ్‌ను తయారు చేసింది. దీని బరువు 37 గ్రాములు మాత్రమే. ఏరోజెల్‌తో  దీన్ని రూపొందించింది. ఈ పదార్థంలో 99 శాతం గాలి, ఒక శాతం గాజు ఉంటుంది. ఈ బ్యాగ్‌ తన బరువు కన్నా 4,000 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. 1,200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. దీనిని రూపొందించడానికి కోపర్నికి గ్రీక్‌ పరిశోధకుడు ఐయోనిస్‌ మిచెలౌడిస్‌ సహకరించారు. 27I16I6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ను తయారు చేయడానికి ముందు 15 నమూనాలు రూపొందించారు. పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో కోపర్ని దీన్ని ఆవిష్కరించింది. గత ఏడాది ఈ సంస్థ వేల సంత్సరాల కిందట భూమిపై పడిన ఒక ఉల్కతో హ్యాండ్‌  బ్యాగ్‌లను తయారు చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :