ASBL NSL Infratech

జన్మభూమి లోగానే అర్హులకు పెన్షన్లు

జన్మభూమి లోగానే అర్హులకు పెన్షన్లు

జన్మభూమి పూర్తి కాగానే అర్హులందరికీ ఇళ్లు
జన్మభూమి లోగానే అర్హులకు పెన్షన్లు
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, డిసెంబర్ 29: గత మూడేళ్లలో ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద మంజూరైన 6 లక్షల ఇళ్లలో ఇంకా రూ. 60వేల ఇళ్ల పనులు ప్రారంభం కాలేదని, వాటిని వెనువెంటనే వెంటనే ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శనివారం ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇళ్లులేని పేదలు 10 లక్షల మందికి పైగా ఉన్నట్లుగా ఆధార్ లింకేజిని అనుసరించి తెలుస్తోందని, పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, జన్మభూమి లోపల ఎంతమందికి ఇళ్లు లేవో అంచనా వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారందంరికీ జన్మభూమి-మా ఊరు పూర్తికాగానే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. జనవరిలో మరో 4లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు పునాదులు వేసేలా చూడాలి.మంచిరోజు చూసి భారీఎత్తున మళ్లీ సామూహిక గృహ ప్రవేశాలను పండుగలా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
గృహమిత్రల సేవలు
గ్రామాల్లో,పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు ‘గృహమిత్ర’లను నియమించుకోవాలని, మెప్మా,డ్వాక్రా మహిళలను గృహమిత్రలుగా ఎంపిక చేయాలని, ఇంటికి కొంత చొప్పున వారికి గౌరవ పారితోషికం ఇచ్చేలా వీలు కల్పించవచ్చని సీఎం అన్నారు. ఇళ్ల నిర్మాణంలో గ్రామీణ,పట్టణ శాఖల మధ్య సమన్వయం అవశ్యమని స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి హౌసింగ్ కార్పోరేషన్ ద్వారా రుణాలకు వెళ్లాలని, ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇస్తామని, ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ జన్మభూమిలో పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఒంగోలు, ఏలూరు, కడప అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలు అయ్యాయని, యూడిఏ కిందకు వచ్చిన ఈ 3పట్టణాలలో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం కావాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో కోరారు. 
ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 19,57,429 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో నిర్మాణం పూర్తయిన ఇళ్లు 7,45,339. నిర్మాణ దశలో మరో 11,61,812 ఇళ్లు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 10,00,086 ఇళ్లు మంజూరు కాగా 4,06,142 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. పీఎంఏవై-ఎన్టీఆర్(గ్రామీణ్) పథకం కింద 1,20,943 ఇళ్లు మంజూరు కాగా 43,071 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిం. పీఎంఏవై-ఎన్టీఆర్(అర్బన్) పథకం కింద 3,86,804 ఇళ్లు మంజూరు కాగా 69,963 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ కింద హుద్‌హుద్ బాధితులకు 9,170 ఇళ్లు మంజూరు చేయగా, 8,788 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. 
పెన్షన్లకు కొత్తగా 2.65 లక్షలు 
జన్మభూమిలోగా అర్హులను గుర్తించాలని సీఎం ఆదేశం
కొత్తగా పెన్షన్లకు 2.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి సామాజిక భద్రతా పెన్షన్లపై మాట్లాడుతూ అర్హులందరికీ పెన్షన్లివ్వాలని, జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలోగా పరిశీలించి వెంటనే మంజూరు చేయాలని కోరారు. గిరిజనుల పెన్షన్ల వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గించామని, ఇందుకు సంబంధించి వచ్చిన 60 వేల దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు. పరిశీలించి మంజూరు చేసిన లబ్దిదార్లకు ఫిబ్రవరి నుంచి పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పథకాల లబ్ది అర్హులకు అందాలని, అత్యధిక కుటుంబాలకు సంక్షేమం చేరువ కావాలని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పేదరికం, మానసిక వైకల్యం, శారీరక వైకల్యం ప్రాతిపదికన అర్హతలను నిర్ణయించాలని చంద్రబాబు సూచించారు. 
శానిటేషన్‌కు ఇవ్వాల్సిన రూ.100 కోట్లు వెంటనే విడుదల
పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇవ్వాల్సిన రూ.100 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, డ్వాక్రా మహిళా సంఘాలకు చెల్లించాల్సిన సొమ్ము వెంటనే ఇవ్వాలన్నారు. బిల్లుల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం సరికాదని, ఆయా శాఖలు సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నామని, మనం చేస్తున్న కష్టం కూడా ప్రజలకు కనపడాలని, చేసినవన్నీ జన్మభూమి సందర్భంగా గ్రామసభల్లో వివరించాలని ముఖ్యమంత్రి కోరారు. కుటుంబ స్థాయిలో ఏం చేశాం? గ్రామ, వార్డు స్థాయులలో ఏం చేశామో అనే అంశాలను ప్రతి గ్రామంలో స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, గోడ రాతల ద్వారా ప్రచారం చేయాలని చంద్రబాబు కోరారు.
నాలుగేళ్లలో రూ.2,409 కోట్లు, అందజేసి చంద్రన్న బీమా పరిహారం

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :