Jammu Kashmir: భారత్‌కు తమ పూర్తి మద్దతు : ప్రధాని మోదీతో ట్రంప్

జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహల్గాంలో నిస్సహాయులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిరచాయి. ఈ ఘటనను అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) తో ఫోనులో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడంలో భారత్ (India)కు తమ పూర్తి మద్దతను ప్రకటించారు. అమెరికా చట్టసభ సభ్యులు, ప్రవాస భారతీయులు (Non-Resident Indians) కూడా దాడులను ఖండిరచారు. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఉగ్రదాడిని ఖండిరచగా, యూరోపియన్ యూనియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ దాడుల్ని నీచమైన చర్యగా అభివర్ణించారు.