John Bolton: మోదీతో ట్రంప్ బంధం ముగిసింది : బోల్టన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలుండేవని, అవి ఇప్పుడు ముగిశాయని అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్ బోల్టన్ (John Bolton) స్పష్టం చేశారు. అది ప్రతి ఒక్కరికీ పాఠమని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో ఉండే సన్నిహిత సంబంధాలు ప్రపంచ దేశాల నేతలను దారుణ పరిస్థితుల నుంచి రక్షించలేవని హెచ్చరించారు. సుంకాల కారణంగా భారత్(India) , అమెరికా (America) ల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.