Donald Trump : వాణిజ్య ఒప్పందంపై చర్చలు.. భారత్ సుంకాలు తగ్గిస్తుందన్న ట్రంప్

భారత్ సుంకాలు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పారు. కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలు (Tariffs) తగ్గించనుందనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఓవల్ ఆఫీస్ (Oval Office) లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేవాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ( బీటీఏ) భారత్, అమెరికా అధికారులు ఈ నెల 23 నుంచి వాషింగ్టన్ (Washington)లో చర్చలు ప్రారంభించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం మూలంగా అమెరికా వస్తువులకు కొత్త మార్కెట్లు తెరుకుంటాయని, రెండు దేశాల్లోని ఉద్యోగులు, రైతులు, ఔత్సామిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయని అమెరికా తెలిపింది. వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం పెడుతుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు యూఎస్ ట్రేడ్ (US Trade) ప్రతినిధులు తెలిపారు.