India: భారత్ పై మళ్లీ నోరు పారేసుకున్న పీటర్ నవారో

భారత్ పై నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్న వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరింతగా రెచ్చిపోయారు. రష్యా చమురు వ్యవహారంలో బ్రాహ్మణులే లాభపడుతున్నారని వ్యాఖ్యానించారు. చైనా, రష్యాలకు భారత్ దగ్గర అవుతుండటంపై నవారో అక్కసు వెళ్లగక్కారు. మోదీ వంటి గొప్ప ప్రజాతంత్ర నాయకుడు, పుతిన్, జిన్‌పింగ్‌లతో ఎందుకు అంటకాగుతున్నారో తనకు తెలియడం లేదన్నారు. ఇదంతా బ్రాహ్మణులు చేస్తున్నారు. వారు తమ లాభాల కోసం తక్కిన జనం ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఈ విషయం భారత ప్రజలు తెలుసుకోవాలి అని అన్నారు. ముడిచమురుపై మోదీకి పుతిన్ రాయితీలు ఇచ్చారు. భారత్‌లో దానిని శుద్ధిచేయించి, యూరప్, ఆఫ్రికా, ఆసియాలకు సరఫరా చేసి పెద్దఎత్తున డబ్బులు చేసుకుంటున్నారు.