Harvard University: డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harvard University) నిధుల నిలిపివేత విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నకు ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీకి అందించే 2.6 బిలియన్ డాలర్ల నిధులను నిలిపేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బోస్టన్ ఫెడరల్ కోర్టు (Boston Federal Court) ఆదేశించింది. వర్సిటీ పాలనా విధానాల్లో మార్పు చేయాలని చేసిన సూచనలను తిరస్కరించిన కారణంగా నిధులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రతీకార చర్య కిందకు వస్తుందని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అలిసన్ బరో (Alison Burrow) స్పష్టం చేశారు. ఫెడరల్ నిధులను నిలిపివేయడాన్ని సమర్థించుకునేందుకు యూదులపై వ్యతిరేకతను కవచంగా వాడారని పేర్కొన్నారు. ఈ తీర్పుతో హార్వర్డ్‌కు భారీ విజయం లభించినట్లయింది.