వెస్ట్‌ఫీల్డ్ బోర్డు అఫ్ ఎడ్యుకేషన్ సభ్యుల రేస్ లో భారతీయ మహిళలు

న్యూజెర్సీలోని వెస్ట్‌ఫీల్డ్ విద్యా మండలి సభ్యుల ఎన్నికల పోటీలో ఇద్దరు భారతీయ-అమెరికన్లు మహిళలు అభ్యర్థులుగా నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 31,2020 తో ముగుస్తున్న ఇద్దరు వెస్ట్‌ఫీల్డ్ విద్యా మండలి బోర్డు సభ్యుల మూడేళ్ల కాలపరిమితి మరియు అదే తేదీతో ముగుస్తున్న మరొక సభ్యుని కాలపరిమితి తో వెస్ట్‌ఫీల్డ్ విద్యా మండలి బోర్డు సభ్యులు పదవులకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే వెస్ట్‌ఫీల్డ్‌లోని బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లోని మూడు ఖాళీలకు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన పది మంది వెస్ట్‌ఫీల్డ్ నివాసితులలో ఇద్దరు భారతీయ-అమెరికన్లు మహిళలు ప్రీతి డేవ్ మరియు సోనాల్ పటేల్.
వెస్ట్‌ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన అభ్యర్థుల సమాచారం ప్రకారం 12 సంవత్సరాలకు పైగా వెస్ట్‌ఫీల్డ్‌లో ఆమె భర్త సందీప్ తలాటి తో కలిసి నివసిస్తున్న ప్రీతి డేవ్ NYU లాస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొంది న్యూయార్క్ నగరంలో 15 సంవత్సరాలకు పైగా కార్పొరేట్ న్యాయవాది గా లా ప్రాక్టీస్ చేస్తున్నారు.గత 17 సంవత్సరాలుగా ఎడిసన్ టౌన్ షిప్ లో మిడిల్ స్కూల్ మాథెమాటిక్స్ టీచర్ గా పనిచేస్తున్న సోనాల్ పటేల్ లెహిగ్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ,ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్ ఇన్‌స్ట్రక్షన్‌లో విద్యలో మాస్టర్స్ మరియు కె -12 మాథెమాటిక్స్ బోధించడానికి న్యూజెర్సీ విద్యా శాఖ సర్టిఫికేట్ పొందారు.