టిఫాస్ కొత్త కార్యవర్గం…

న్యూజెర్సిలోని తెలుగు కళాసమితి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ప్రెసిడెంట్‍గా శ్రీదేవి జాగర్లమూడి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‍గా బిందు యలమంచిలి, కార్యదర్శిగా ఉషాదర్శిపూడి, ట్రెజరర్‍గా జ్యోతి గంధి, ఐటీ విభాగం వ్యవహారాలు మెంబర్‍గా అనూరాధ దాసరి, మెంబర్ షిప్ వ్యవహారాల సభ్యునిగా శ్రీనివాస్ చెరువు, కల్చరల్ ఈవెంట్స్ కమిటీ సభ్యురాలిగా అనురాధ, కమ్యూనిటీ వ్యవహారాల మెంబర్‍గా రవి అన్నదానం, యూత్ వ్యవహారాల సభ్యురాలిగా యశోద దశిక ఎన్నికయ్యారు.
కొత్త అధ్యక్షురాలు శ్రీదేవి జాగర్లమూడి మాట్లాడుతూ, తమను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ, ఈ కమిటీలో విభిన్న ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉన్నారని, దానికితోడు వైవిధ్యమైన కళలు, అభిరుచులు ఉన్నవారైనందున తమ కమిటీ తరపున విభిన్నమైన కార్యక్రమాలను, కమ్యూనిటీకి ఉపయోగపడే సేవలను చేయనున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో దానికి తగ్గట్టుగా తమ సేవలను అందిస్తామని, ముందుగా సభ్యుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నామని, కొత్త సభ్యులను చేర్పించడంతోపాటు, అంతకుముందు యాన్యువల్, పైవ్ ఇయర్స్ మెంబర్‍షిప్ కాలపరిమితి అయిపోయిన సభ్యులను లైఫ్‍మెంబర్స్గా మార్చేదిశగా ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. తమ కార్యక్రమాల్లో యువతను ప్రోత్సహించడంతోపాటు వారిని భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. సీనియర్ సిటిజన్స్కు, కమ్యూనిటకీ ఉపయోగపడే కార్యక్రమాలను అందరి సూచనలు, సహాయసహకారాలతో నిర్వహించనున్నట్లు శ్రీదేవి జాగర్లమూడి తెలిపారు.