ప్రైమరీ ఎన్నికలో జో బిడెన్ విజయం

న్యూజెర్సీ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి ప్రైమరీలో ఎక్కువగా మెయిల్ ద్వారా జరిగిన బ్యాలెట్ ఎన్నికల్లో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ విజయం సాధించారు. ఈ బ్యాలెట్ ఎన్నిక మంగళవారం జరిగింది. డెమొక్రటిక్ నియామక అభ్యర్థిత్వానికి కావాలసిన డెలిగేట్లను బిడెన సాధించుకున్నప్పటికీ వెర్మెంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ను బ్యాలెట్ ఎన్నికలో గట్టిగా ఎదుర్కోవలసి వచ్చింది. డెలవేర్ డెమొక్రటిక్ ప్రైమరీలో కూడా బిడెన్ విజయం సాధించ గలిగారు. అక్కడ రిపబ్లికన్ ప్రైమరీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధించారు. వచ్చే నెల డెమొక్రాట్స్ సమావేశంలో తన అభ్యర్థిత్వాన్ని సాధించడానికి కావలసిన గెలిగేట్లను కూడగట్టుకున్నారు.