Kaloji Award: రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం

ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు గారి పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే.
2025 వ సంవత్సరానికి కాళోజీ సాహితీ పురస్కారం ఎంపిక కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, లోక కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమతి నెల్లుట్ల రమాదేవి (Nellutla Rama Devi) గారిని 2025 వ సంవత్సరపు కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమోదించి, అభినందనలు తెలిపారు.
కాళోజీ జయంతి ఉత్సవాలలో భాగంగా, తెలంగాణ భాషా దినోత్సవం సంబరాలలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు
సెప్టెంబర్ 9, 2025 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో గౌరవ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణా రావు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఇతర అధికార, అనధికార ప్రముఖుల సారధ్యంలో నిర్వహించబడుతుంది.
పరిచయం :
పేరు : నెల్లుట్ల రమాదేవి
కలం పేరు : రమ ( కార్టూనిస్ట్ గా )
స్వస్థలం : స్టేషన్ ఘనపూర్ ( ఉమ్మడి వరంగల్ జిల్లా )
పుట్టిన ఊరు : హైదరాబాద్
పుట్టిన తేదీ : 12 .01.1962
తల్లిదండ్రులు: శ్రీమతి శకుంతలా దేవి, కీ. శే. నెల్లుట్ల రామచందర్ రావు
భర్త: కీ. శే. వేముల దేవేందర్
పిల్లలు: ధ్రువ తేజ్, నయన్ దీప్ ( software engineers,USA)
చదువు : SSC వరకు స్టేషన్ ఘనపూర్
ఇంటర్ , డిగ్రీ : రెడ్డి కాలేజ్ , నారాయణ్ గూడా , హైదరాబాద్ ( RBVRR Womens College)
M A ( Economics) , KU , WARANGAL
Professional Course: CAIIB
వృత్తి : సీనియర్ బ్యాంక్ మేనేజర్ , ఆంధ్రా బ్యాంకు /UBI ( R)
ప్రస్తుతం faculty గా బ్యాంకు ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కొన్ని కాలేజీల్లో, స్కూల్స్ లో విద్యార్థులకు orientation classes తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులందజేస్తున్నారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లో సభ్యురాలిగానూ, వ్యక్తిగత స్థాయిలోనూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రచురింపబడిన పుస్తకాలు :
1 . మనసు భాష ( కవిత్వం )- 2011
2 . రమణీయం ( కార్టూన్లు )- 2011
3 . మనసు మనసుకూ మధ్య ( కథలు )- 2011
4.చినుకులు ( నానీలు )- 2021
5. తల్లి వేరు ( కథలు )-2021
6 .డి . కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్-2023
7 . అశ్రువర్ణం ( కవిత్వం )-2024
8 .రమాయణం-1 ( కాలమ్స్ )-2024
పురస్కారాలు :
1 .సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం ( కవయిత్రి తొలి సంపుటికి -2004 )
2 .అపురూప అవార్డు , కార్టూన్లకు (2014 )
3 .తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి (వరంగల్ జిల్లా )-రాష్ట్ర ఆవిర్భావ ప్రధమ వార్షికోత్సవం (2015 )
4 .పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం (2015 )
5 . జాతీయ సాహిత్య పరిషత్తు , సిద్దిపేట వారి ఐతా భారతి చంద్రయ్య సంప్రదాయ కథా సాహితీ పురస్కారం (2015 )
6 . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు -కథలకు-(2017 )
7 . పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం (2017 )
8 . గుఱ్ఱం జాషువా ఫౌండేషన్ పురస్కారం ( 2018 )
9 .వెంకటసుబ్బు స్మారక అవార్డు ( 2019 )
10 .పర్చా రంగారావు స్మారక అవార్డు – (2019 )
11 . తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారం -(2021 )
12 . రాగతి పండరి స్మారక పురస్కారం- కార్టూనిస్ట్ గా బాపు రమణ అకాడమీ వారిచే (2021 )
13 . ప్రొ. వాసిరెడ్డి భాస్కర్ రావు స్మారక పురస్కారం – తల్లివేరు కథా సంపుటికి ( 2023 )
14 .ఎక్స్ రే పత్రిక ఉత్తమ కవితా పురస్కారం -2024
15 . డా. రాణీ పులోమజా దేవి స్మారక గౌరవ పురస్కారం -తల్లివేరు కథా సంపుటికి (2025 )
16. డా. సినారె సాహిత్య పురస్కారం- 2025( యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం-2025)
17. అబోపా, వరంగల్ వారి’ సాహిత్య కళానిధి’ పురస్కారం- 2025
ఇంకా ..కార్టూన్లకూ , కవిత్వం లోనూ , కథలకూ పలు బహుమతులు పొందారు.
సహ సంపాదకత్వం :
కవితా వార్షిక , వరంగల్ ( 5 సంవత్సరాలు )
అభినందన ( అమృతలత -అపురూప అవార్డు గ్రహీతల అభినందన సంచికలు(2010 -2025 )
ఇతరములు : నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం ‘ బతుకమ్మ ‘ లో సెప్టెంబర్ 2022 నుండి 128 వారాలుగా ‘ రమాయణం ‘ కాలమ్ రచన.
అరవై మూడేళ్ల జీవితంలో ఒక్క అయిదేళ్లు తప్ప ఊరిలో ( శివునిపల్లి) లోనే ఉన్నార. విద్యార్థులకు, వృద్ధులకు చేతనైన సహాయం చేయడం ఇష్టం. ప్రస్తుతం వ్యవసాయం, రచనలు నా జీవితంగా ఉన్నారు.
మొబైల్ నెం : 94406 22781
మెయిల్ ఐడి : ramadevi.nellutla@gmail.com