హైదరాబాద్ లో ఆక్యుజెన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం
అమెరికాకు చెందిన బయెటెక్ సంస్థ ఆక్యుజెన్ రూ. వెయ్యి కోట్లతో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనుంది. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. సంస్థ చైర్మన్, సీఈవో ముసునూరి శంకర్, పరిశోధన విభాగాధిపతి అరుణ్ ఉపాధ్యాయ్, భారత విభాగాధిపతి అరుణ్ పొట్లూరి, ఇతర ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను న్యూయార్క్‌లో కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. జెన్, సెల్ థెరపీలలో తాము పరిశోధనలు చేస్తామని వెల్లడించారు. తెలంగాణకు ఈ కేంద్రం కీలకంగా మారుతుందని, ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు ఉపయుక్తమవుతుందని కేటీఆర్ తెలిపారు.






