హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది. ఈ నెల 18న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్)లో ఫాబా ఇన్నోవేషన్ క్లస్టర్ సదస్సు జరగనుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిసి ది ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ ( ఫాబా) ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 300 మంది వరకు ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పీ రెడ్డన్న తెలిపారు. ఈ సదస్సుకు ముందు రోజు (17వ తేదీ) వేల్ ట్యాంక్ 2.0 పేరుతో బయోటెక్ స్టార్టప్స్ ప్రదర్శన ఉంటుందన్నారు.