Chandrababu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• పారిశ్రామిక కార్మికులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.
• ముఖ్యమంత్రితో కలిసి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో పాల్గొన్న మంత్రి నారాయణ, కొల్లు రవీంద్ర, కొణతాల రామకృష్ణ సహా ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, అధికారులు.
• పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించిన సీఎం చంద్రబాబు.
• పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజల నుంచి సహకారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
• ఇంట్లో పనికి రాని వస్తువులను తీసుకుని నిత్యావసరాలు ఇచ్చే స్వచ్ఛ రథాన్ని పరిశీలించిన సీఎం
• స్వచ్ఛ రథాలు ఉపయోగపడుతున్నాయా అని స్థానికులు అడిగిన ముఖ్యమంత్రి.
• కంపోస్ట్ తయారీ యార్డ్ సందర్శించిన సీఎం చంద్రబాబు.
• చెత్తను కాంపోస్ట్ గా తయారీ చేసి రైతులకు ఎరువులను అందిస్తున్న కంపోస్ట్ యూనిట్ నిర్వాహాకుడు.
• కంపోస్ట్ యూనిట్ ద్వారా అందించే ఎరువులు రైతులకు ఉపయోగపడుతున్నాయా అని ఓ రైతును అడిగి తెలుసుకున్న సీఎం… దిగుబడి కూడా పెరిగిందని చెప్పిన స్థానిక రైతు.
• అనంతరం ప్రజా వేదికలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
• పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తామని సభికులతో ప్రతిజ్ఞ చేయించిన విద్యార్థులు.
• ఉత్తమ తీరు కనబర్చిన పారిశుధ్య కార్మికులను సత్కరించి మొమెంటోలు అందించిన సీఎం చంద్రబాబు
• సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ నిర్వహించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఎస్వీడబ్ల్యూతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్,
• పంచాయతీరాజ్, సెర్ప్ మధ్య సీఎం సమక్షంలో ఎంఓయూ
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….
• దేశం మొత్తం స్ఫూర్తినిచ్చేలా స్వచ్ఛభారత్ కార్యక్రమం నడుస్తోంది.
• ప్రజల భాగస్వాములతో ఏ కార్యక్రమం చేసినా అది శాశ్వతంగా ఉంటుంది… ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది.
• పరిసరాల పరిశుభ్రతే కాదు…ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి
• ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపించేది పారిశుధ్య కార్మికులే…వారికి కృతజ్ఞతలు తెలపాలి
• సర్క్యులర్ ఎకానమీ పాలసీ తెచ్చి రీ సైక్లింగ్ చేపట్టాం.
• కార్మికులు ఇళ్ల వద్ద చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. ప్రజలు వేర్వేరుగా చెత్తను అందిస్తున్నారని తెలిపారు.
• ఇది బలవంత కార్యక్రమం కాదు.. భావితరాల కోసం చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి
• స్వచ్ఛ రథాలు తీసుకొచ్చాం. ప్లాస్టిక్, బాటిళ్లు వంటి వాటిని తీసుకుని వాటికి విలువకు సరిపడా సరుకులు అందిస్తున్నారు.
• వేస్ట్ నుంచి సంపద కలుగుతోంది…ఇది చాలా సంతోషం
• చెత్తను కంపోస్ట్ గా తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు.
• గతంలో ఎక్కువ రసాయనాలు వాడే రైతులు… ఇప్పుడు కంపోస్ట్ ఎరువులు వాడుతున్నామని రైతులు చెప్తున్నారు
• పారిశుధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సేవకులు. వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం.
• స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణా:ద్ర సాకారం కాదు. అందుకే వారికి అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నాం.
• మీకు ఒక పిలుపు ఇస్తున్నా….175 నియోజకవర్గాల్లో జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం
• రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ నివారించాం.
• గత ప్రభుత్వం 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చింది.
• జనవరి 26కు రోడ్డుపై వేస్ట్ అనేది కనబడకుండా టార్గెట్ పెట్టుకున్నాం.
• ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా పొడిచెత్తను సేకరిస్తున్నాం. వీటి సంఖ్య 100కు త్వరలోనే పెంచి మరిన్ని అందుబాటులోకి తెస్తాం
• పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లల్లో హెం కంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్టుగా పెట్టుకున్నాం… ఇది 3.91 లక్షల ఇళ్లలో ఇది జరుగుతోంది.
• అలాగే రూరల్ ప్రాంతంలో 10 లక్షల ఇళ్లల్లో హెం కంపోస్ట్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే… 3.30 లక్షల ఇళ్లల్లో చేస్తున్నాం.
• మార్చి 26 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.
• ఇంటి వద్దే కూరగాయలు పండించుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు.
• ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండాల్సిందే.
• అన్ని గ్రామాలు ఓడీఎఫ్ గా ఉండాలి. మరుగుడొడ్లు కట్టుకుని వినియోగించుకోవాలి.
• గతంలో నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాను…కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నా.
• కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు ఆన్ లైన్ ఉంచి సుపరిపాలనకు శ్రీకారంచుడుతున్నాం
• ప్రభుత్వ సేవలు ఎంత వేగంగా ప్రజలకు అందించడం, డబ్బులు అడగకుండా సేవలు అందిస్తాం
• పాలన ఎలా ఉండాలో ఏపీని చిరునామాగా మార్చుతాం.
• నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, ప్రధాని ప్రజలకు మాటిచ్చాం… సూపర్ 6 అమలు చేసి మీ రుణం తీర్చుకున్నాం.






