MGDP 4.0 కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన రెండు హైదరాబాద్ స్టార్ట్అప్స్
ఎంజి మోటర్ ఇండియా యొక్క MG డెవలపర్ ప్రోగామ్ మరియు గ్రాంట్ సీజన్ 4.0 (MGDP 4.0) లో హైదరాబాద్ కు చెందిన రెండు స్టార్ట్అప్ సంస్థలు తమ అద్భుతమైన ఐడియాలతో విజేతలుగా నిలిచాయి అని కంపెనీ ప్రకటించింది. ఇందులో ఒకటి సెంటార్ ఆటోమోటివ్ (Centaur Automotive) కాగా మరొకటి ఆంప్లిఫై క్లీన్టెక్ సొల్యూషన్స్ (Amplify Cleantech Solutions). ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ – ఇన్నోవేట్ ఫర్ ఇండియా’ అనే థీమ్ తో స్టార్ట్అప్స్, డెవలపర్లు మరియు ఆవిష్కర్తల కోసం మెరుగైన ఇన్నోవేషన్ వేదికను అందించి, తద్వారా కొత్త కొత్త ఆలోచలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
సెంటార్ ఆటోమోటివ్ ఎలెక్ట్రిక్ సైకిళ్ళ రూపకల్పన మరియు తయారీలో ఉండగా, ఆంప్లిఫై క్లీన్టెక్ సొల్యూషన్స్ దేశవ్యాప్తంగా విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఆపరేట్ చేస్తుంది.
విద్యార్థులు, ఆవిష్కర్తలు, అన్వేషకులు, అంకుర సంస్థలు, టెక్ కంపెనీలతో సహా MGDP 4.0 లో 250 కి పైగా బృందాలు ఆసక్తి చూపగా, వాటిలో 88 పరిగణనకు స్వీకరించబడ్డాయి. మే 18 మరియు 25 వ తేదీలలో జరిగిన వర్చువల్ జ్యూరీ రౌండుకి ఎంపిక చేయబడ్డ 14 బృందాల లో ఆరుగురు విజేతలుగా నిలిచారు. ఇందులో, హైదరాబాద్ చెందిన రెండు స్టార్ట్అప్ లతో పాటు, బెంగళూరు, గుర్గావ్, మరియు ముంబై కి చెందిన నాలుగు సంస్థలు ఉన్నాయి.
ఎంజి మోటర్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, “ఒక బ్రాండుగా ఎంజి వినూత్నతను మూలస్థంభంగా చేసుకొని గ్రీన్ మొబిలిటీపై నిరంతరం దృష్టి సారిస్తూ వచ్చింది, మరియు పాల్గొన్నవారు మరియు ఆలోచనాకర్తల మధ్య పరిజ్ఞాన పంపకమును పెంపొంచడం, వారి ఆలోచనలకు సజీవ రూపం ఇవ్వడం, మరియు ఇండియాను ఆవిష్కరణ మరియు టెక్నాలజీకి నిలయంగా చేయడం MGDP 4.0 లక్ష్యంగా చేసుకొంది. ఒక బ్రాండుగా మేము మార్పు మరియు వినూత్న ఆలోచలనలను ప్రోత్సహిస్తాము. ఈ సీజన్లో పాల్గొన్న బృందాలలో 30% పైగా కనీసం ఒక మహిళా వ్యవస్థాపకులతో ఉండడం మెచ్చుకోదగ్గ విషయం,” అని అన్నారు.
స్టార్టప్ ఇండియా అధిపతి ఆస్థా గ్రోవర్ ఇలా అన్నారు, “ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు స్టార్ట్అప్ సంస్థలు తమ వినూత్నతను ప్రదర్శించడానికి మరియు సమస్యా పరిష్కారంలో కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఇటువంటి నిమగ్నతా కార్యక్రమాలు సరియైన వేదికను అందిస్తాయి. సుస్థిరత్వం మరియు క్లీన్ ఎనర్జీ పట్ల నానాటికీ పెరుగుతున్న దృష్టిసారింపుతో, విద్యుత్ వాహనాలు ఈ రంగాన్ని తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అత్యాధునిక టెక్నాలజీలతో పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో స్టార్ట్అప్ సంస్థలు ముందువరుసలో నడుస్తున్నాయి.”
తర్వాతి తరం ఆవిష్కర్తలు మరియు ఔత్సాహికవేత్తలకు మద్దతు ఇవ్వడానికై అనేక అగ్రగామి సంస్థల సహకార సమన్వయముతో MGDP 4.0 ప్రారంభించబడింది. ఒక సానుకూల వ్యవస్థను కల్పించడానికి మరియు డెవలపర్లు, ఇన్వెస్టర్లు, మరియు వ్యాపార సంస్థలు వికసించేలా సాధికారపరచడానికి ఎంజి మోటర్, ఇన్వెస్ట్ ఇండియా మరియు స్టార్టప్ ఇండియా వంటి ప్రధాన పరిశ్రమ సంస్థలు మరియు Jio-BP, Exicom, Fortum, Attero, MapmyIndia, మరియు Bosch వంటి అగ్రగామి టెక్నాలజీ దిగ్గజాలతో చేతులు కలిపింది.
ఈ కార్యక్రమంలో 4 ఛార్జింగ్ మౌలిక సదుపాయాల స్టార్ట్అప్ సంస్థలు, 2 EV OEM స్టార్ట్అప్ సంస్థలు మరియు 8 సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) ప్రొవైడర్లు పాల్గొన్నారు.






