Mahesh Kumar Goud : బీజేపీ తరహాలోనే ఆ పార్టీ కూడా బీసీలకు వ్యతిరేకం : మహేశ్‌కుమార్ గౌడ్

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) , సీతక్క (Seethakka ) తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 90 శాతానికి పైగా ప్రజలు దీన్ని నమ్మినందుకే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project ) లో అవినీతి జరిగినందునే విచారణను సీబీఐ (CBI ) కి అప్పగించాం. కాళేశ్వరం అంశంపై మాట్లాడలేకే కేసీఆర్ మొహం చాటేశారు. బీసీ బిల్లు కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాడుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. మండలిలో బీసీ బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నానా హంగామా చేశారు. బీజేపీ తరహాలోనే ఆ పార్టీ కూడా బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అని విమర్శించారు.