Bathukamm festival: ఎల్బీస్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు : మంత్రి జూపల్లి

బతుకమ్మ పండుగ (bathukamm festival) ను గొప్ప కార్నివాల్‌గా నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. మంత్రులు కొండా సురేఖ , సీతక్క (Seethakka) తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఈ నెల 21న వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించే లక్ష్యంతో ఈనెల 29న ఎల్బీస్టేడియం (LB Stadium ) లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తాం. పీపుల్స్ ప్లాజలో మహిళ స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనేలా వేడుకలుంటాయి. బతుకమ్మకు జాతీయ స్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని తెలిపారు. బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పిస్తామని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. ఈ పండుగ గురించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి దేశవిదేశాలకు తెలిసేలా చేస్తామన్నారు. పర్యాటకశాఖ, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.