సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్.. టీటీడీలో

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధులు భక్తులకు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలో వసతి, స్వామి వారి దర్శనానికి అనుమతించాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. హైదరాబాద్‌లో స్పీకర్ ప్రసాద్ కుమార్ చంద్రబాబును కలిసి ఈ మేరకు లేఖ అందజేశారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అంతకుముందు చంద్రబాబుకు స్పీకర్ పుష్పగుచ్చం అందజేశారు.