తెలంగాణలో 29 వరకు లాక్డౌన్
రాష్ట్రంలో కరోనాను పూర్తిస్థాయిలో నియంత్రించడానికి వీలుగా ఈ నెల 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం వరకు రాష్ట్రమంతటా కర్ప్యూ కూడా అమలులో ఉంటుందని తెలిపారు. ఆరెంజ్, గ్రీన్జోన్ల పరధిలో ఉన్న 27 జిల్లాల్లో అన్ని దుకాణాలు బుధవారం నుంచి తెరుచుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఇప్పటివరకు తీసుకొన్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ కార్యాలయాలు పూర్తి స్థాయిలో రాష్ట్రమంతటా పని చేస్తాయి. గృహనిర్మాణ పనులు చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన దుకాణాలు కూడా అందుబాటులో ఉంటాయి.
రెడ్‌జోన్ జిల్లాల్లో కఠినంగా నిబంధనల అమలు :
రెడ్‌జోన్ జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువ. మొత్తం కేసుల్లో 66 శాతం ఇక్కడే ఉన్నాయి. సామాజిక, వ్యాప్తికి కూడా ఇక్కడే అవకాశం ఉన్నందున ఎలాంటి పరిస్థితి లోనూ రాజీపడబోం.
ఇక్కడ నిబంధనలు కఠినంగా అమలవుతాయి. ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం హైదరాబాద్‌ను సురక్షితందగా కాపాడుకోవాలి. కేసులు తగ్గినా 70 రోజులు చూడాలని శాస్త్రవేత్తలు చెప్తున్నందున లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాం. హైదరాబాద్‌లో కరోనా కర్వ్ తగ్గుముఖం పడుతోంది. వైద్య ఆరోగ్యశాఖకు అవసరమైన పీపీఈ కిట్లు సహా అన్నీ పూర్తిస్థాయిలో అందుబాటలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు కూడా సాయం చేసే స్థితిలో ఉన్నాం. 15న మళ్లీ సమీక్షిస్తాం. పరిస్థితిని బట్టి హైదరాబాద్‌లో కూడా కొన్ని దుకాణాలు తెరిచే విషయం పరిశీలిస్తామని తెలిపారు.






