Vishnupriya: నటి విష్ణుప్రియకు హైకోర్టు ఆదేశం… దర్యాప్తునకు

బెట్టింగ్ యాప్స్ కేసులో నటి విష్ణుప్రియ (Vishnupriya) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు లో విచారణ జరిగింది. మియాపూర్(Miyapur) పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (FIR )ను కొట్టివేయాలని నటి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్ కొట్టివేయడానికి, దర్యాప్తుపై స్టే విధించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించిన కోర్టు, చట్ట ప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్స్ (Betting apps ) పై ప్రచారం చేసిన పలువురు నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై మియాపూర్ పోలీసులు (Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.