KTR: సమస్యే లేదు, కేటిఆర్ కు హైకోర్ట్ షాక్

ఏసీబీ (ACB) విచారణ నేపధ్యంలో తెలంగాణా హైకోర్ట్ లో కేటిఆర్ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదిని విచారణకు అనుమతించే అవకాశం లేదని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్యన వాడీ వేడీ వాదనలు జరిగాయి. లైబ్రరీ లో న్యాయవాది కూర్చోడానికి సౌకర్యం ఉందని.. లైబ్రరీ గ్లాస్ నుండి కేటీఆర్ (KTR) విచారణ కనిపిస్తుందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. కేటీఆర్ తో పాటు న్యాయవాది వెళుతారని.. కేటీఆర్ తో పాటు రాం చందర్ రావు అటెండ్ అవుతారని కోర్ట్ కు వివరించారు.
ఆడియో విడియో రికార్డింగ్ కావాలని కేటీఆర్ న్యాయవాది కోర్ట్ ను కోరారు. ఆడియో విడియో రికార్డింగ్ కావాలా, న్యాయవాది అనుమతి కావాలా అని ప్రశ్నించిన హై కోర్టు.. రెండు వెసులుబాటులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ముందు రేపు విచారణ కు హాజరుకండి అంటూ కేటిఆర్ న్యాయవాదికి సూచించింది. విచారణలో ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ హైకోర్టుకు రావొచ్చని సూచించింది. కేవలం చూడడానికి మాత్రమే న్యాయవాదికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది కోర్ట్.
అవినాష్ రెడ్డికి రెండు వెసులుబాటలు ఇచ్చారు అని కేటీఆర్ న్యాయవాది తెలపగా అవినాష్ రెడ్డి కేసు వేరు, కేటీఆర్ కేసు వేరు అని వ్యాఖ్యానించింది కోర్ట్. అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తు సమయంలో సిబిఐ విచారించింది, ఇక్కడ విచారిస్తుంది ఏసీబీ కదా అని ప్రశ్నించింది. లైబ్రరీ రూమ్ తో పాటు, సీసీటీవీలు ఉండే రూమ్ నుండి న్యాయవాది కేటీఆర్ ను చూడవచ్చని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్ట్ ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది.
విచారణ రూమ్ లోకి కేటీఆర్ తో పాటు అడ్వకేట్ ను అనుమతించేది లేదని ఇన్వెస్టిగేషన్ రూమ్ లో కేటీఆర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రామచందర్ ఏసీబీ ఆఫీస్ లోకి వెళ్ళాలని ఇన్వెస్టిగేషన్ రూమ్ పక్కన ఉన్న లైబ్రరీ లో కూర్చొని… లైబ్రరీ విండో నుంచి ఇన్వెస్టిగేషన్ ను అడ్వకేట్ అబ్జర్వ్ చేయొచ్చని తెలిపారు. విచారణ లో ఏమైనా ఇబ్బంది ఉన్నా.. ఇన్వెస్టిగేషన్ రూమ్ నుండి అడ్వకేట్ కి కేటీఆర్ కనిపించకపోయినా.. రేపు మళ్ళీ కోర్టుకు రమ్మని కేటీఆర్ తరపు న్యాయవాదికి సూచించింది.