KTR :కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR ) కు హైకోర్టు (High Court) లో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్లును హైకోర్టు ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.