ఫిక్కీ నుంచి స్మార్ట్ అర్బన్ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్న రామ్కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

ప్రతిష్టాత్మక ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ) యొక్క స్మార్ట్ అర్బన్ ఇన్నోవేషన్ అవార్డు 2024 లలో “సస్టెయినబుల్ సిటీస్” విభాగంలో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (రామ్కీ)కి అవార్డు లభించింది. ఈ గుర్తింపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో ఉన్న లెగసీ లీచేట్ శుద్ధి మరియు నాశనం చేయటంలో వారి గణనీయమైన తోడ్పాటు ను గుర్తించి, గౌరవిస్తుంది.
5వ ఎడిషన్ స్మార్ట్ అర్బన్ ఇన్నోవేషన్ అవార్డ్స్ సందర్భంగా ఈ అవార్డును అందించారు, ఇది ఫిక్కీ యొక్క సిటీస్ సమ్మిట్ 7వ ఎడిషన్‌తో పాటు క్లిష్టమైన పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సమస్యల కోసం చర్చలు మరియు వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించడానికి నిర్వహించబడింది. కార్పొరేట్లు, ప్రభుత్వ సంస్థలు మరియు విద్యా సంస్థలతో సహా పలు సంస్థ ల నుంచి దేశంలోని స్మార్ట్ సిటీల మిషన్ కోసం పని చేస్తున్న రికార్డు స్థాయి 98 ఎంట్రీల నుండి గుర్తింపు పొందిన 10 సంస్థలలో రామ్కీ కూడా ఒకటి.
వ్యర్థాల కుళ్ళిపోవడం వల్ల వచ్చే విషపూరితమైన ఉప ఉత్పత్తి, లెగసీ లీచేట్. సమీపంలోని నీటి వనరులతో పాటు భూగర్భ జలాలను కలుషితం చేయడం ద్వారా తీవ్రమైన పర్యావరణ ముప్పును ఇది కలిగిస్తుంది. రామ్కీ యొక్క వినూత్న పరిష్కారం ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన 2,000 KLD లీచేట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కలిగి ఉంది. ఈ ప్రాజెక్టులో వ్యర్థ పదార్థాల నిర్వహణ సదుపాయానికి సమీపంలో ఉన్న చెరువుల పునరుద్ధరణ మరియు స్థిరీకరణ కూడా ఉంది. ముఖ్యంగా, హైదరాబాద్‌లో లెగసీ లీచేట్ యొక్క ప్రాథమిక అంచనా పరిమాణం 849,780.88 కిలోలీటర్లు (KL) కంటే ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన సవాలును ఎదుర్కొంది.
“సస్టైనబుల్ సిటీస్ విభాగం కింద స్మార్ట్ అర్బన్ ఇన్నోవేషన్ అవార్డు 2024 అందుకోవడం మేము గౌరవంగా భావిస్తున్నాము ” అని రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వై.ఆర్. నాగరాజ అన్నారు “ఈ గుర్తింపు, మన నగరాలకు స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేసే నగర పరిష్కారాలను అందించడంలో రామ్కీ యొక్క తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లీచెట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఈ నిబద్ధతకు నిదర్శనంగా నిలవటం తో పాటుగా భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించి పరిశ్రమ బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన రేపటికి దోహదపడే మౌలిక సదుపాయాల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి మరియు అందించడానికి మేము అంకితభావంతో ఉన్నాము” అని జోడించారు.