Pawan Kalyan: నాకు పునర్జన్మ ఇచ్చిన నేల తెలంగాణ : పవన్ కల్యాణ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. తనలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ (Telangana) అని పేర్కొన్నారు. జనసేన పార్టీ (Janasena Party ) కి జన్మనిచ్చిన నేల. నాకు పునర్జన్మను ఇచ్చిన నేల నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య (Dasarathi Krishnamacharya) కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలతో పాటు దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా విద్యార్థులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.