Sridhar Babu : కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ : మంత్రి శ్రీధర్‌బాబు

అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నివేదికపై ఆదివారంలో సభలో చర్చ జరుగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు (BC Reservation Bill ) ను ఆదివారం సభలో పెడతాం. కాళేశ్వరంపై సభలో బీఆర్‌ఎస్ (BRS) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే నాలుగైదు రోజుల తర్వాత సభ నడుపుతాం. గణేష్ నిమజ్జనం (Ganesh immersion) , వరదల దృష్ట్యా సభను వాయిదా వేయాలి అని తెలిపారు.