తెలంగాణలో రూ.3 వేల కోట్లతో మెడ్‌ట్రానిక్స్ పెట్టుబడులు
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో మెడ్‌ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. మెడ్‌ట్రానిక్స్ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుతవ్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో పెట్టుబడులు తరలివస్తున్నాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి లేదని అన్నారు.






