KTR: లోట్టపీసు సిఎం.. విచారణ తర్వాత మారిన యాటిట్యూడ్

తెలంగాణాలో (Telangana) ఫార్ములా ఈ రేస్ వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటిఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కేటిఆర్ (KTR) ను నేడు ఏసీబీ అధికారులు విచారించారు. మొత్తం 7 గంటల పాటు జరిగిన ఈ విచారణలో పలు కీలక ప్రశ్నలు సంధించారు అధికారులు. విచారణకు ముందు.. కాస్త కంగారు పడిన కేటిఆర్.. విచారణ తర్వాత మాత్రం కాన్ఫిడెంట్ గా కనిపించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
సంక్రాంతి తర్వాత మరోసారి కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చాను అన్నారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతాను స్పష్టం చేసారు. రేవంత్(Revanth Reddy) రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారని నాలుగు ప్రశ్నలను 40 సార్లు అడిగారన్నారు. కొత్తగా వాళ్లు అడిగిందేమీ లేదని ఎద్దేవా చేసారు. ఏసీబీ వాళ్ళు 85 ప్రశ్నలు అడిగారన్నారు. అడిగిందే మళ్ళీ అడిగారని ఫార్ములా e రేస్ ద్వారా హైదరాబాద్ ఇమేజ్ పెంచామన్నారు.
రేవంత్ లా గలీజ్ పనులు మేము చేయలేదు అని.. ఏసీబీ వాళ్లకు చెప్పానన్నారు. ఎన్ని సార్లు రమ్మని చెప్పిన వస్తా అని చెప్పినా అంటూ కామెంట్ చేసారు. ఎన్ని కేసులు పెట్టిన ఇస్తానని మోసం చేసిన హామీల గూర్చి మాట్లాడుతామన్నారు. ఇది లొట్టపిసు కేసు అని నేను జైల్ కి వెళ్లినా అందరిని పంపాలి అని రేవంత్ ఆలోచన చేస్తున్నా అన్నారు. రేవంత్ కి బీఆర్ఎస్ నాయకులు ఎవరు భయపడారన్నారు కేటిఆర్. ముఖ్యమంత్రిని ఎవరు గుర్తు పట్టడం లేదని ఎద్దేవా చేసారు.
నిజాయితీ కి ధైర్యం ఎక్కువన్నారు. లొట్టపిసు కేసు..లొట్టపిసు ముఖ్యమంత్రి అంటూ సెటైర్ లు వేసారు. రేవంత్ ప్రశ్నలు పంపితే మళ్ళీ విచారణ కి పిలుస్తారు కావొచ్చు వెళ్తా పిలిస్తే వెళ్తాను అన్నారు. చిన్న తప్పు అవినీతి చేయలేదన్నారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను నేడు ఈడీ అధికారులు విచారించారు. 8 గంటలపాటు అరవింద్ కుమార్ ను విచారించిన ఈ డి అధికారులు.. కార్ రేస్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈ డి భావిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనే ఈ విచారణ సాగింది. 45.71 కోట్ల రూపాయలను ఎఫ్ ఈ ఓ సంస్థకు నిబంధనల అతిక్రమించి ఏ విధంగా బదిలీ చేశారని… ఎవరి ఆదేశాలతో బదిలీ జరిగింది అనే కోణంలో అరవింద్ కుమార్ ను ఈడి అధికారులు ప్రశ్నించారు.