పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు : కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు న్యాయకోవిదులతో చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులపై ఢల్లీిలో బీఆర్‌ఎస్ న్యాయపోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందన్నారు. బీఆర్‌ఎస్ తరపున త్వరలోనే సుప్రీం కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.