IITH: అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఐఐటీ హైదరాబాద్ మధ్య చారిత్రక ఒప్పందం
హైదరాబాద్: అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఏకం చేసే ప్రముఖ సంస్థ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA), భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ హైదరాబాద్ (IITH) తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తెలుగు సంస్కృతిపై మక్కువ, ప్రజలపై సేవా దృక్పథంతో పనిచేస్తున్న ఏటా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ అడుగు వేసింది.
సహకార ఒప్పందంలోని కీలకాంశాలు…
విద్యార్థుల మార్పిడి కార్యక్రమం (Student Exchange Program): అమెరికాలోని విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌లో సమ్మర్ క్లాసులు, సెమిస్టర్ కోర్సులు లేదా స్వల్పకాలిక కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఏఐ (AI), సెమీకండక్టర్ విభాగాలలో శిక్షణ లభిస్తుంది.
పరిశోధనలు: ఐఐటీహెచ్‌లోని 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్’లో పరిశోధన ప్రాజెక్టులు చేసే అవకాశం.
స్టార్టప్, పెట్టుబడులు: 320కి పైగా స్టార్టప్‌లతో బలమైన వ్యవస్థ కలిగిన ఐఐటీహెచ్‌లో, అమెరికాలోని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలు కలుగుతుంది.
ఇంటర్న్‌షిప్ అవకాశాలు: ఐఐటీహెచ్ విద్యార్థులు అమెరికా, భారతీయ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లు పొందేలా ప్రోత్సాహం.
సమన్వయకర్తలు
ఈ కార్యక్రమానికి ఆటా ఎడ్యుకేషన్ కమిటీ ప్రతినిధులు సుశీల్ చందా (ఛైర్), రవి లోతుమల్ల, సతీష్ యెల్లమిల్లి (కో-ఛైర్స్) సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
ఆసక్తి గల విద్యార్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు: https://tinyurl.com/ATA-IITH-SEP
మరిన్ని వివరాల కోసం ఏటా అధికారిక వెబ్సైట్ www.americanteluguassociation.org ను సందర్శించవచ్చు.






