ATA: సేవా కార్యక్రమాల్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముందంజ.. ఘనంగా ‘గిఫ్ట్ బాస్కెట్ డొనేషన్’
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తన సేవా దృక్పథాన్ని చాటుకుంటూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ‘గిఫ్ట్ బాస్కెట్ డొనేషన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. సమాజం పట్ల బాధ్యత, సంస్కృతి పట్ల మక్కువ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించనున్నారు.
బాస్కెట్ మేకింగ్ (కానుకల తయారీ): డిసెంబర్ 19, శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు పిల్లలు, పెద్దలు కలిసి ఈ కానుకల బుట్టలను సిద్ధం చేశారు.
బాస్కెట్ డొనేషన్ (కానుకల వితరణ): డిసెంబర్ 20, శనివారం ఉదయం 9 గంటలకు ఈ కానుకలను అవసరమైన వారికి పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తారు.
ATA కార్యవర్గం, సమన్వయకర్తలు: ఈ కార్యక్రమ విజయవంతం కోసం ఏటా రీజనల్ కోఆర్డినేటర్లు కృష్ణ మోహన్ ములే, ప్రదీప్ కట్టా, ప్రసాద్ ఆకుల, రీజనల్ ఉమెన్స్ చైర్ గీతా రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే రీజనల్ డైరెక్టర్లు విలాస్ జంబుల, ప్రవీణ్ ఆలతో పాటు పలువురు ప్రాంతీయ ప్రతినిధులు తమ సహాయ సహకారాలను అందించారు. ATA ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జయంత్ చల్లా (ప్రెసిడెంట్), సతీష్ రామసహాయం రెడ్డి (ప్రెసిడెంట్ ఎలెక్ట్), మధు బొమ్మినేని (పాస్ట్ ప్రెసిడెంట్), సాయినాథ్ బోయపల్లి (సెక్రటరీ), శ్రీకాంత్ గుడిపాటి (ట్రెజరర్), ఇతర సభ్యులు ఈ సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు.
రాబోయే వేడుకలు: ఇదే ఉత్సాహంతో 19వ ఏటా కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌ను 2026 జులై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.






