హెచ్ఐసీసీలో గేవింగ్ సదస్సు
ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 14వ ఎడిషన్ హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో గేమింగ్ టెక్నాలజీ, ఆవిష్కరణలు, భవిష్యత్తు ట్రెండ్స్, అభివృద్ధి, శిక్షణ తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. ఇందులో ఈఏ స్పోర్ట్స్, ఆక్టివిజన్ బ్లిజార్డ్ కింగ్, గుడ్ డాగ్ స్టూడియోస్, యుబీసాప్ట్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, లుమికాయ్స్ స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 22 ప్రకారం భారత గేమింగ్ పరిశ్రమ రూ.21 వేల కోట్లకు చేరింది. 2027 నాటికి ఇది 71 వేల కోట్లకు చేరుతుంది.






