తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియను త్వరగా తేల్చేయాలన్న భావనతో ఆ పార్టీ హైకమాండ్ ఉంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నూతన రథసారథి ఎంపిక ప్రక్రియ విషయంలో స్పీడ్ పెంచింది. ఇందుకోసం అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతల్లో ఎవరికీ పగ్గాలు అప్పగించాలో పేర్కొంటూ ముగ్గురి పేర్లతో రూపొందించిన జాబితాను పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రథసారథి ఎంపికపై నెలకొన్న సందిగ్దానికి త్వరలో తెరపడనుంది. కొద్దిరోజుల్లోనే తెలంగాణ బీజేపీ నూతన రథసారథి ప్రకటన వెలువడనుందని పార్టీలో ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు.