High Court :హరీశ్‌రావుకు షాక్ ఇచ్చిన హైకోర్టు

కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నివేదికపై మాజీ మంత్రి, బీఆర్‌స్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టు (High Court) లో ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హరీశ్‌రావు ((Harish Rao) తరపు న్యాయవాది అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలని కోరారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని కోర్టుకు తెలిపారు. అసెంబ్లీ (Assembly ) లో చర్చించాకే చర్యలు తీసుకుంటామని కోర్టుకు ఏజీ తెలిపారన్నారు. అసెంబ్లీలో తీర్మానించకుండానే సీబీఐ (CBI ) కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రేపటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. ఈ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై పదేపదే హరీశ్‌రావు తరపు న్యాయవాది అభ్యర్థించినా కోర్టు అంగీకరించలేదు. మరోవైపు కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం నిర్ణయం తెలుసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ( జీపీ) సీజే ధర్మాసనం కోరింది. రేపు లేదా ఎల్లుండి చెబుతామని ఆయన బదులిచ్చారు. రేపటి వరకు ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని హైకోర్టు ఆయన్ను ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.