ఇండియన్ ఎంబసీకి విప్ ఆది శ్రీనివాస్ లేఖ

సౌదీ ఆరేబియాలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇమ్రాన్‌ను స్వదేశం పంపించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సౌదీ ఆరేబియాలోని ఇండియన్ ఎంబసీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. 45 రోజుల క్రితం ఇమ్రాన్ సౌదీ అరేబియా వెళ్లి అక్కడ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్నందున స్వదేశం వెళతానని చెప్పడంతో కంపెనీ వాళ్లు హింసిస్తున్నారని వీడియోను పంపారని లేఖలో ఆది శ్రీనివాస్ తెలిపారు.