తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ
తెలంగాణ రాష్ట్రంలోకి మరో అంతర్జాతీయ సంస్థ ప్రవేశించింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ టెలిపెర్ఫారెన్స్ తెలంగాణలో క్యాంపస్‌ను ప్రారంభించనున్నది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి, క్యాంపస్ తమ పెట్టుబడుల గురించి వివరించారు. మొత్తం 3 వేల మందికి ఉగ్యోగ అవకాశాలు కల్పించన్నుట్లు వారు తెలిపారు. వచ్చే నెలలో క్యాంపస్‌ను ప్రారంభించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. 1978లో పారిస్ కేంద్రంగా సంస్థ కార్యకలాపాలను డానియెల్ జులియెన్ ప్రారంభించారు. క్రమంగా విస్తరిస్తూ ప్రపంచవ్యా ప్తంగా శాఖలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణకు తరలివచ్చింది.






