సెర్ప్ తో ఫ్లిప్కార్డ్ ఒప్పందం
మహిళా సంఘాల వస్తువులను తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లో విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ`కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్డ్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్ ) ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో, ఫ్లిప్కార్ట్ ఉపాధ్యక్షుడు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో మహిళ సంఘాల వస్తువులతో పాటు ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యం కూడా ఫ్లిప్కార్డ్ ఆన్లైన్లో విక్రయించనుంది. దీనిద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరగడంతో పాటు వ్యాపార వృద్ధి జరిగి వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందుబాటులోకి రానున్నాయి.






