హైదరాబాద్ లో తొలిసారి ఫార్ములా-ఈ రేసింగ్
ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ఫార్ములా-ఈ రేసింగ్‌కు తొలిసారి హైదరాబాద్ వేదిక కానుందని గ్రీన్ కో వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిభ్రవరి 11న హైదరాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమ 100 రోజుల కౌంట్‌డౌన్‌ను దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కపిల్ దేవ్, తెలంగాణ ప్రభుత్వ తరపున సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫార్ములా ఈ ప్రిక్స్ ఈవెంట్‌ను ప్రపంచంలోని పన్నెండు దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, అందులో భారత్ కూడా ఒకటని కేంద్ర మంత్రి అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరగనున్నది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన తొమ్మిదవ సీజన్ అని నిర్వాహకులు తెలిపారు.






