గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేలతో సీఎం భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలకు హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపైన సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ చాంబర్లో సమావేశం జరిగింది. ఇందులో మంత్రితో పాటు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్, విజయ రమణారావు, పాయల్ శంకర్, టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు వినోద్ కుమార్, భీంరెడ్డి పాల్గొన్నారు.