న్యూయార్క్‌లో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్‌లో జెఎఫ్‌కె ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ అమెరికా కాలమానం ప్రకారం 3 ఆగస్టు 24 మధ్యాన్నం 3గంటలకు విమానాశ్రయానికి వచ్చారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, తెలంగాణ చాప్టర్ మరియు ఇండియన్ డయాస్పోరా తరపున అనేక మంది తెలుగువాళ్ళు, ప్రముఖులు, కాంగ్రెస్ అభిమానులు, తెలంగాణ అభిమానులు వచ్చి ఘన స్వాగతం చెప్పారు.