Sudarshan Reddy:ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వండి : రేవంత్ రెడ్డి
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy ) ని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో కలిసి సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇండియా కూటమి ఆలోచనను ఆయన గౌరవించారని తెలిపారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంత్యంత ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీయే అభ్యర్థిని పెట్టింది. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ, తెలుగువాడికి ఇప్పుడొక అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) , మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi ) లకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలి అని అన్నారు.







