క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభానికి రండి… సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభానికి విచ్చేయాలని కోరుతూ క్రెడాయ్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. క్రెడాయ్ రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్‌ను స్టాన్ కాన్ పేరుతో వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయించారు. భవన నిర్మాణదారుల సమస్యలు, పెట్టుబడి దారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సమావేశంలో చర్చించనున్నారు. మొత్తంగా 900 మంది డెవలపర్లు ఈ కాంక్లేవ్‌లో పాల్గొనున్నారు. ఈ మేరకు క్రెడాయ్ ప్రతినిధులు చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షుడు ప్రేంసాగర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి అజయ్‌కుమార్‌లు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు.