తనను అడ్డుకునే అధికారం… ఏ అధికారికి లేదు

తనపై జీహెచ్‌ఎంసీ విజిలెన్స్, డిజాస్టర్ విభాగం నమోదు చేసిన కేసుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ప్రహారిగోడ కూల్చివేత విషయంలో తనపై కేసు పెట్టారని చెప్పారు. నందగిరి హిల్స్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా వెళ్లిన తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదని స్పష్టం చేశారు. కేసులు తనకు కొత్తమే కాదని, ఈ ఘటనపై అధికారులకు ప్రివిలైజ్ నోటీసులు ఇస్తా అని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.