Bhatti Vikramark : అప్పడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా? : భట్టి విక్రమార్క

ప్రతిపక్షాలకు అసెంబ్లీ (Assembly ) లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ( పీపీటీ) ఇచ్చే సంప్రదాయం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ (Bhatti Vikramark) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో తాము పీపీటీ (PPT ) కి అవకాశం ఇవ్వాలని లేఖ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అప్పుడు తమకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూ.6,500 కోట్ల వడ్డీ కట్టట్లేదనే బీఆర్‌ఎస్ (BRS) వాదన సరికాదని పేర్కొన్నారు. మరి వడ్డిలు ఆ పార్టీ నేతలు కడుతున్నారా అని ప్రశ్నించారు.