సీఎం రేవంత్‌రెడ్డితో ఆనంద్ మహీంద్రా భేటీ

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని దత్తత తీసుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. త్వరలోనే తన సంస్థకు చెందిన బృందాన్ని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు పంపుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయిన ఆనంద్ మహీంద్రా ఈ మేరకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపైనా సీఎంతో ఆయన చర్చించారు. హైదరాబాద్‌లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిస్టార్ట్ విస్తరణకు ఆయన ముందుకొచ్చారు.